
వేములవాడ నేటిధాత్రి
టియుడబ్ల్యూ హెచ్ 143 వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్ జన్మదిన వేడుకలను గురువారం జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం రఫిక్ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకున్నారు.తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులందరికీ రఫిక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.తమ సంస్థ బలోపేతానికి కృషి చేస్తూనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తానని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య, సీనియర్ జర్నలిస్ట్ మొకాళ్ళా ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ,శ్రీహరి, మాజీ అధ్యక్షుడు ఎంరెడ్డి కనక రెడ్డి,ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, బండి శ్రీకాంత్,రజనీకాంత్, రాజేందర్, వెంకటేష్, శ్రీకాంత్, నుగురి ప్రశాంత్, పొగుల వేణు బండి హరీష్, జగన్, దీపక్, కోడం గంగాధర్,పాల్గొన్నారు.