చందుర్తి, నేటిధాత్రి:
గాలి బీభత్సం
ఎగిరిపోయిన నిరుపేద ఇంటి పై రేకులు
తన సొంత గ్రామంలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలు వెళ్లి కాయకష్టం చేసి గత సంవత్సరం నూతనంగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కీర్తి (మేర) వెంకటేష్ s/o మేర సత్తయ్య నూతనంగా రేకులతో ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు కానీ మంగళవారం వీచిన ఈదురు గాలుల దుమారానికి వెంకటేష్ ఇంటి పైన కప్పిన రేకులు ఎగిరిపోయి సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో పడిపోయాయి దీంతో గాలి దుమారానికి రేకులు ఎగిరిపోయి పడడంతో నిరుపేద కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది కుటుంబీకులు తీవ్ర దుఃఖంతో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. బీద కుటుంబమైన వారికి ప్రభుత్వ పరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే నిరుపేద కుటుంబం కావడంతో దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అతనికి సహాయం చేయవలసిందిగా వేడుకున్నారు.