
ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడు ఇంట్లో ఉండకుండా బడిలో చేరే విధంగా చూడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఉపాధ్యాయులు, గ్రామైఖ్య సంఘం అధ్యక్షులు, అంగన్వాడీ టీచర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మరుగుదొడ్లు,మంచి నీటి సరఫరా,విద్యుత్ సరఫరా మైనర్ రిపేర్ చేసి పేయింటింగ్ తో సహ అన్ని వసతులు జరిగిందని ఇప్పటికే ఉదయం టిఫిన్ ఏర్పాటు మధ్యాహ్నం బోజనం,ఏకరూప దుస్తులు , పుస్తకాలు నోటుబుక్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని ఇట్టి విషయాన్ని తల్లి తండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో విధ్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు.మండల విద్యాశాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ 3 వ తేదీ నుంచి అన్ని గ్రామాలలో ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు, విఓఏలు టీం లాగా వెళ్లి ప్రతి రోజూ సాయంత్రం వరకు రిపోర్ట్ పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఏ.వీ.బాస్కర్,యస్.ఐ, ఏ.పి.యం,ఐసీడీఎస్ సూపర్వైజర్,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విఓఏలు తదితరులు పాల్గొన్నారు.