
శాయంపేట, నేటి ధాత్రి:
శాయంపేట మండలం గంగిరేణి గూడెం, సూర్య నాయక్ తండా కాట్రపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్, వరంగల్ జిల్లా ప్రొహిబిషన్, వరంగల్ రూరల్ ఎక్సైజ్ అధికారి ఆదేశానుసారం గుడంబాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కార్యాచరణలో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడులునిర్వహించారు.పరకాల రూరల్ ఎక్సైజ్ సీఐ తాతాజీ పేర్కొన్నారు. గుగులోతు రామన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 20 లీటర్ల గుడంబాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎనిమిది వందల లీటర్ల గుడుంబా నిల్వ ఉంచిన పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి, కానిస్టేబుల్ సత్తయ్య, ప్రశాంత్, వరుణ్ రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు.