
శాయంపేట నేటిధాత్రి :
శాయంపేట మండలంలోని శాయంపేట,పలు గ్రామాల్లో విత్తన ఎరువుల షాపులో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున మండలంలోని అందరు లైసెన్సు కలిగిన విత్తన డీలర్లు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండి ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రికార్డులను రిజిస్టర్ బిల్లు బుక్కులను లైసెన్సులను పరిశీలించడం జరిగింది. నాసిరకమైన విత్తనాలు అమ్మిన, విడిగా విత్తనాలను రైతులకు అమ్మకాలు చేస్తూ,రైతులకు రసీదు ఇవ్వకున్న చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.ఇందులో వ్యవసాయ అధికారి, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.