సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని బీరెల్లి,ముత్తరావుపల్లి,సుందర శాల,నర్సక్కపేట్, దుగ్నపల్లి,వెంకంపేట తదితర గ్రామాల నుండి సుమారు 100 మంది రైతులు శుక్రవారం రోజున చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు వెళ్లి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మంత్రికి అందించిన వినతి పత్రంలో అన్నారం బ్యారేజ్ నీటి ఉధృతి వల్ల పంట పొలాలు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కష్టపడి పండించిన పంట నీటి పాలవుతుందని, రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి అప్పులు చేసి మరి పండించిన పంట చేతిదాకా వచ్చి నోటిదాకా రాకుండా పోతుందని, రైతు కుటుంబాలన్నీ రోడ్డున పడే దుస్థితి వచ్చిందని తెలియజేయడం జరిగింది. రైతుల సమస్యను విన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారంగా ఆనకట్టను నిర్మించడానికి ప్రభుత్వం తరఫున 200 కోట్లు విడుదల చేస్తామని వీలైనంత తొందరగానే రైతుల సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ సంతోషాన్ని వ్యక్తం చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే ముందుండి నడిపించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు.