విత్తన డీలర్ల షాపును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నేటి ధాత్రి యాదాద్రి చౌటుప్పల్ :

మండల కేంద్రంలో విత్తన డీలర్ల షాప్ ను గౌరవ కలెక్టర్ జిల్లా శ్రీ హనుమంతు జె డంగే IAS తనిఖీ చేయడం జరిగినది. విత్తన షాప్ కు సంబంధించిన లైసెన్స్ యొక్క గడువు కాలము స్టాక్ బోర్డ్ వివరాలు మరియు విత్తనాల పంపిణీ చేసిన కంపెనీల యొక్క పత్రాలను మరియు ఇన్వాయిస్ బిల్లును పరిశీలించారు. పత్తి విత్తన ప్యాకెట్ల మీద ఉన్న లేబుళ్లను పరిశీలించి సంబంధించిన వివరాలను డీలర్లను అడిగి అ? రైతు విత్తనం కొన్న తర్వాత ఇచ్చే రసీదును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అది కృత విత్తన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు కొన్న తర్వాత తప్పనిసరిగా రైతు సంతకం తో కూడిన రసీదును తీసుకోవాలని ఖాళీ విత్తన ప్యాకెట్లు కూడా సీజన్ అయ్యేంతవరకు భద్రపరుచుకోవాలని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ తరపున నాలుగు స్క్వాడ్ టీం లు ఏర్పాటు చేశామని తనిఖీ బృందాలకు పత్తి విత్తన షాపును పరిశీలించే రిపోర్టర్ అందజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. అలాగే జై కేశారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మూడు రోజులలో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని మొత్తం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి K అనురాధ మాట్లాడుతూ జిల్లాలో పత్తి విత్తనాలు మరియు ఎరువులు అందుబాటులో ఉన్నాయని కృత్రిమ కొరత సృష్టించే వారిపై పిడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ జిల్లా వెంట జిల్లా వ్యవసాయ అధికారి, డివిజన్ వ్యవసాయ అధికారి బి దేవ్ సింగ్, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, AEOలు మరియు విత్తన డీలర్ దాచేపల్లి శ్రీనివాస్, MRIరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!