నిర్లక్ష్యానికి నిలువుటద్ధం సంరక్ష హాస్పిటల్ అని ఇటీవలే కథనం ప్రచురించిన “నేటిధాత్రి” పత్రిక
హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నేడు నిండు ప్రాణం బలి అయినట్లు బంధువుల నిరసన
ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీశారు అంటూ బంధువుల ఆరోపణ
హాస్పిటల్ యాజమాన్యం, ఐ.ఎం.ఏ డాక్టర్లు చర్చల పేరుతో లోపలికి పిలిసి హేళన చేశారని బంధువుల వాదన?
ఏమి చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అని హాస్పిటల్ వర్గాలు అన్నట్లు బంధువుల ఆవేదన
రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు, ససేమిరా ఒప్పుకోని కుటుంబ సభ్యులు
ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు శూన్యం?, పైగా ఇలాంటి హాస్పిటల్స్ కు ఉత్తమ సేవ అవార్డులు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పులోని వెంకట్రామా జంక్షన్ వద్ద గల సంరక్ష హాస్పిటల్లో రోజు రోజుకీ మరణాల సంఖ్య పెరుగుతోంది అని అనడానికి నిదర్శనంగా మరోసారి వరంగల్ కు చెందిన వాణి (42) అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లు బంధువులు మహిళ మృతదేహంతో హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే, వరంగల్ నగరానికి చెందిన వాణి (42) అనే మహిళ, గత కొద్ది సంవత్సరాలుగా సంరక్ష హాస్పిటల్లోనే పని చేసేది, మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, వారు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు చేస్తున్నారు, వారి హెల్త్ కార్డు ద్వారా వాల్ల అమ్మకు, నాన్నకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. ఇటీవల ఆమెకు మూత్ర పిండాల సమస్య రావడంతో పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసి, ఆమె పనిచేస్తున్న సంరక్ష హాస్పిటల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా తన కుటుంబం అడ్మిట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కిడ్నీని తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీతో పాటు కిడ్నీకి ఆనుకొని ఉన్న, కొన్ని నరాలు కట్ కావడంతో, మహిళ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిపారు, అస్వస్థతకు గురైన ఆమెను చూసి, ఆమె భర్తకు టెన్షన్ తో గుండెపోటు రావడం జరిగింది అని. వెంటనే అదే హాస్పిటల్లో అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉండటం వల్ల, డాక్టర్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని తెలిపారు. ఒకే హాస్పిటల్లో అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరు అడ్మిట్ అయి ఉండటం వల్ల దుంఖం, ఆందోళనతో ఉన్న ఇద్దరు అమ్మాయిలకు మీ తల్లి ఆరోగ్యం బాలేదు, హైదరాబాద్ తీసుకెళ్లండి అని డాక్టర్లు చెప్పడంతో వారికి అనుమానం వచ్చి ఏమి ట్రీట్మెంట్ చేశారు ఇన్ని రోజులు? 9 లక్షలు ఎందుకు క్లెయిమ్ చేశారు? ఇప్పుడెందుకు హైదరాబాద్ అంటున్నారు అని గట్టిగా నిలదీశారు. మెడికల్ షాపు బిల్లు మూడు లక్షల రూపాయలు వరకు కడితే చాలు మిగతాది మేము ఇన్సూరెన్స్ కార్డు ద్వారా క్లెయిమ్ చేసుకుంటాం అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే బంధువులు, మిత్రులు హాస్పిటల్ కి చేరుకొని ఆందోళన చేశారు. గడచిన 13 రోజుల నుంచి ఏ ట్రీట్మెంట్ చేశారు ఏమో తెలియదు కానీ, రోగి పరిస్థితి అత్యంత ప్రమాదంలోకి వెళ్లడం గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆసుపత్రి డాక్టర్లను యజమాన్యంను నిలదీయగా వారు ఉస్మానియా ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను సైతం పిలిపించి వైద్యం చేయించాం అని తెలిపిన డాక్టర్లు, అయినా కానీ పేషెంట్ కండీషన్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పగానే, పేషెంట్ తరపున బంధువులు అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఆసుపత్రిలో అని ఆందోళన చేసి. ఆసుపత్రి యజమాన్యంను నిలదీయగా వెంటనే స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ రంగప్రవేశం చేసి దాదాపు గంటన్నర అటు బంధువులతో, ఇటు డాక్టర్లతో చర్చించి, జరిగిన సంఘటనపై వివరాలు ఆరా తీసి, జరిగిన తప్పిదాన్ని వైద్యుల నిర్లక్ష్య నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని, వెంటనే వైద్యులను మందలించి పేషంటుకు న్యాయం చేశారని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం తరపున ఇద్దరు డాక్టర్లు మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని తెలిపి, మీకు హైదరాబాద్ లో జరిగే ట్రీట్మెంట్ కి కూడా మేమే డబ్బులు ఇస్తాం అని, పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే అని, పేషెంట్ కి కావాలసిన ట్రీట్మెంట్ మొత్తం ఖర్చులు, ఇన్సూరెన్స్ బాధ్యత హాస్పిటల్ యాజమాన్యమే బాధ్యత అని పేపర్ రాసి, పేషెంట్ ను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి పంపించారు పోలీసులు. అయినా బంధువులు ఆందోళన చేయగా డాక్టర్లు మా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది కాబట్టి మేమే సహాయం చేస్తామంటూ బంధువులకు మాయమాటలు చెప్పి పంపించేశారు అని, హైదరాబాద్ లో అడ్మిట్ చేసినప్పుడు సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం కొంత డబ్బుని యశోద హాస్పిటల్ వారికి కట్టడం జరిగింది అని, మిగతా డబ్బును కట్టే క్రమంలో సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం ద్వారా, మహిళకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్ వారు ఆపేశారని. అందువల్లే మహిళ మృతి చెందింది అని, మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు మృతదేహంతో సంరక్ష హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. వరంగల్ పోలీసులు, ఐఎంఏ డాక్టర్లు వచ్చి, అటు హాస్పిటల్ యాజమాన్యంతో, ఇటు మహిళ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. హాస్పిటల్ యాజమాన్యం, ఐ.ఎం.ఏ డాక్టర్లు చర్చల పేరుతో లోపలికి పిలిసి హేళన చేశారని బంధువుల వాదన?, ఏమి చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అని హాస్పిటల్ వర్గాలు అన్నట్లు బంధువుల ఆవేదన. రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు, ససేమిరా ఒప్పుకోని కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎది ఏమైనా ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు శూన్యం అనే చెప్పొచ్చు. పైగా ఇలాంటి హాస్పిటల్స్ కు ఉత్తమ సేవ పేరిట అవార్డులు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.