
నర్సంపేట,నేటిధాత్రి :
ఎండలో ఆడుతుండగా తల్లి మందలించిందని క్షీణికావేశానికి గురై ఒక బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని మైసంపల్లె గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు,దుగ్గొండి ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం మైసంపల్లె గ్రామానికి చెందిన మోకిడే శాంత చిన్న కుమారుడు మోకిడే సిద్దు (కాంతారావు) 9 సం. తో పాటు మరో 15 సంవత్సరాల వయసుగల కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు 10వ తరగతి కోచింగ్ కోసం పాఠశాలకు వెళ్లాడు.చిన్న కుమారుడు సిద్దు మూడవ తరగతి చదువుతూ వేసవి సెలవుల సందర్భంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. గత వారం రోజులుగా విపరీతమైన ఎండలు ఉండడంతో బయటకు వెళ్ళద్దని తల్లి మందలించింది.క్షిణికావేశానికి గురైన సిద్దు గురువారం ఇంట్లో ఉన్న తల్లి స్లాబ్ పై ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్ళగా ఇంట్లోని ఫ్యాను కొండికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదురుగా ఉన్న ఇంటివాళ్లు గమనించి అరుపులు వేస్తూ సిద్ధుని బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. మేనమామ డోలే యువరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.