
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
పరకాల నేటిధాత్రి
అమ్మ ఆదర్శ పాఠశాలలో మంజూరు చేయబడిన పనులను పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు పూర్తి చేసి అందంగా ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.గురువారం పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పరకాల ఉర్దూ మీడియం పాఠశాలలో పనులు అసంపూర్తిగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేసి పంంపిస్తే వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని పనులు పూర్తి అయిన పాఠశాలలో పేయింటింగ్ చేసిన తర్వాత బెంచీలు కుర్చీలు తదితర సామగ్రిని సరఫరా చేస్తామని అన్నారు.కాంపౌండ్ వాల్ ఉన్న పాఠశాలల్లో లోపల మంచి మొక్కలు నాటి అందంగా తీర్చి దిద్దాలని అన్నారు.అనంతరం ఎరువులు విత్తనాల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.రైతులకు నఖిలీ విత్తనాలు అమ్మరాదని ఒకవేళ ఏవైనా పిర్యాదులు వస్తే దుకాణాదారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండల వ్యవసాయ శాఖ అధికారిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది తో తనఖీలు చేయించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డాక్టర్.వెంకటనారాయణ,రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ కె నారాయణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దార్ ఏ.వీ భాస్కర్,మున్సిపల్ కమీషనర్ నరసింహ,మండల విద్యాశాఖ అధికారి రమాదేవి, ఐకేపి ఏపియం క్రాంతి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.ఓ.ఏలు,టి.యల్.యఫ్ లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.