
మహిళా సంఘం కుట్టు మిషన్ సందర్శన
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు పాఠశాలల సంబంధిత మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఎంపియుపిఎస్ కొత్తకట్టు సింగారం, జెడ్ పి ఎస్ ఎస్ మాందారి పేట జెడ్ పి ఎస్ ఎస్ బాయ్స్ స్కూల్ శాయం పేట, టీఎస్ డబ్ల్యూ ఈ ఐ డియు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అదనపు గదులు నిర్మాణము కావాల్సిన వన్నీ తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఎంపీడీవో మండల అధికారులు ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
మహిళ స్వశక్తి కుట్టు కేంద్రం ను సందర్శించిన కలెక్టర్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సురేఖ మండల సమైక్య సంఘం శాయంపేట ఆధ్వర్యంలో మహిళా యూనిఫామ్స్ స్వశక్తి కుట్టు కేంద్రం ను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. స్కూల్ యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ పనులను పరిశీలించగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యే లోపుగా యూనిఫార్మ్స్ కుట్టుటపూర్తి చేయాలని మహిళలకు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో మహిళా స్వశక్తి కుట్టుకేంద్ర సభ్యులు అధికారులు పాల్గొన్నారు.