
కౌన్సిలర్,బీజేపీజిల్లా ప్రధానకార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్
పరకాల నేటిధాత్రి
వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మున్సిపల్ 21 వార్డు కౌన్సిలర్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంత్ లాల్ పిలుపునిచ్చారు.శనివారం పరకాల పట్టణంలోని పలు వార్డులలో ఉదయం ప్రచారం నిర్వహించారు.ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చిన్నతనంలోనే జాతీయ వాదానికి ఆకర్షితుడై ఏబివిపిలో చేరి విద్యార్థి ఉద్యమాలు సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.బిజెపిలో చేరి తెలంగాణ ఉద్యమంలోనే ముందు వరుసలో నిలిచి తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను,విధానాల లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల గొంతుకగా నిలబడ్డారు
పట్టభద్రుల,నిరుద్యోగుల, ఉద్యోగుల,ఉపాధ్యాయుల, విద్యావంతులు సమస్యల పై ప్రశ్నించే వ్యక్తిని శాసనమండలికి పంపించాలని కోరుతున్నాను.బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపాలని కోరారు.ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పక్కన 1అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో మరాఠి నర్సింగరావు,వేణు శెట్టి రాజేష్,పున్నo అశోక్, తదితరులు పాల్గొన్నారు.