
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణంలో ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ లో బీటీ రోడ్డు వెయనందుకు గుంతలో వర్షపు నీరు మల్లుకున్నాయని 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోడ్డు వెంట బారి వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయని రాత్రిపూట ప్రమాదం జరిగే అవకాశమున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వర్షపు నీరు ఇండ్లలోకి వెళ్లి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే స్పందించి రోడ్డును తనిఖీ చేసి చర్యలు తీసుకొని బీటీ రోడ్డు వేయించాలని అదేవిధంగా రోడ్డును తనిఖీ చేసే అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు ఈ విషయమై మున్సిపల్ ఏఈ సాయి కిరణ్ వివరణ కోరగా త్వరలోనే బీటీ రోడ్డు వేయిస్తామని చెప్పారు