మంచిర్యాల, నేటి ధాత్రి:
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఎన్నికల నుండి స్వచ్ఛందంగా అధ్యక్షుని పోటీలో వైదొలుగుతున్నట్టు పార్వతి రాజిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పత్రికా విలేకరుల పట్ల మీడియా ప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి జర్నలిస్టు ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏర్పడిన డిజెఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి జరుగుతున్న ఎన్నికలలో తాను పోటీలో ఉండడం లేదని ఆయన మందమర్రిలో విడుదల చేసిన ఒక ప్రకటనలోతెలిపారు. డీజేఎఫ్ ఏర్పడింది ఒక మంచి లక్ష్యసాధన కోసమని అలాంటి నాయకత్వ విధానాలు చాలా కాలం కొనసాగాలని సదుద్దేశంతోటే తాను పోటి నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు.డీజేఎఫ్ మిత్రులంతా రేపు జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పూర్తి న్యాయం చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరంగా డిజెఎఫ్ పోరాడుతుందని కనుక ఓడిన గెలిచిన మన సంఘ అభివృద్ధి కోసం మిత్రులందరు సహృదయంతో సహకరించాల్సిందిగా ఆయన కోరారు.