#రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి.
#రూరల్ సీఐ రాజగోపాల్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేసి విక్రయాలు చేస్తే పీడీ యాక్ట్ కేస్ నమోదు చేయడం జరుగుతుందని రూరల్ సీఐ రాజగోపాల్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎరువుల విత్తనాల డీలర్ల అవగాహన సమావేశం ఎస్సై రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా ముఖ్యఅతిథిగా సిఐ రాజగోపాల్ పాల్గొని మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు రైతులు వచ్చే క్రమంలో కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే అనుమతులు లేని విత్తనాలు పురుగుమందులను విక్రయించరాదని ప్రతి రైతుకు విక్రయించిన వస్తువుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ప్రతిరోజు తప్పనిసరిగా విత్తనాల వివరాలను స్టాక్ బోర్డు నందు పొందుపరచాలని ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి పర్యావేక్షణ జరుగుతుందని ఆ తరుణంలో ఎలాంటి తప్పు చేసిన పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయని ఆయన సూచించారు కార్యక్రమంలో ఫర్టిలైజర్ డీలర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బిక్షపతి, కార్యదర్శి మచ్చిక రవి గౌడ్, కోశాధికారి శివరాత్రి శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు గోనె రాంబాబు, డీలర్లు గోనె వీరస్వామి, సురకంటి తిరుపతిరెడ్డి, ఎస్.కె మైనుద్దీన్, తిప్పని శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, గంపకేదారి గుప్తా, అశోక్ రెడ్డి, కర్ర కృష్ణారెడ్డి, మధు, శ్రీనివాస్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.