
పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో పరకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి వొడితల ప్రణవ్ నేత్రుత్వంలో, పరకాల పట్టణంలోని 46,47,53 మరియు 59 పోలింగ్ బూతుల పరిధిలోని పట్టభద్రులను కలిసి,బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి(1)ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రం చూపిస్తూ ప్రచారం నిర్వహించిన పట్టణ ఇంచార్జి మాదన్నపేట సర్పంచ్ గుండపు చరణ్ పటేల్,డాక్టర్ మడికొండ శ్రీను,ఒకటో వార్డ్ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు పావుశెట్టి వెంకన్న,రంజాన్ అలీ,కొక్కిరాల స్వాతి తిరుపతి రావు, ఎండీ అలీ,మచ్చ సుమన్,గోవిందు సురేష్, రవీందర్,పసుల శ్రీను, చందుపట్ల రాజి రెడ్డి,దిలీప్, కందుకూరి విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీ భాద్యులు, మహిళలు,పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.