# విత్తన,ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు.
# విత్తన డీలర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి
# వ్యవసాయ అధికారి దయాకర్..
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
రైతులకు కృత్రిమ కొరత సృష్టిస్టించిన,నాసికరం విత్తనాలు విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్ అన్నారు.
దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి మండల కేంద్రంలో గల విత్తనాల, ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల వ్యవసాయ అధికారి దయాకర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున మండలంలోని అందరు లైసెన్సు కలిగిన విత్తన డీలర్లు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండి ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.ఏదైనా డిమాండ్ ఉన్నటువంటి విత్తనాల రకాలు షాపులో ఉన్నప్పటికీ కృత్తిమ కొరత సృష్టించిన, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన,నాసిరకమైన విత్తనాలు అమ్మిన, విడిగా విత్తనాలను రైతులకు అమ్మకాలు చేస్తూ,రైతులకు రసీదు ఇవ్వకున్న చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకొని వారిపై పి.డి చట్టం ,విత్తన చట్టం, నిత్యావసరల సరుకుల చట్టం, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేస్తామని ఈసందర్భంగా హెచ్చరించారు.అదేవిధంగా ప్రతి ఒక్క విత్తన డీలర్ రైతులకు అమ్మినటువంటి విత్తనాలకు సంబంధించి ఒక రిజిస్టర్ రైతు వారిగా వివరాలను నమోదు చేసి తనిఖీ అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందజేయాలన్నారు. ధరల పట్టిక, స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలు అన్ని సమకూర్చుకొని ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా రైతులకు తోడ్పాటు అందించాలని ఏఓ దయాకర్ తెలియజేశారు.