జననేత…విజేత!

https://epaper.netidhatri.com/view/272/netidhathri-e-paper-23rd-may-2024%09/2

`తొడగొట్టి బిఆర్‌ఎస్‌ను పడగొట్టి!

`ఖమ్మంను కాంగ్రెస్‌ మయం చేసి,

`ఎదురులేని నేతగా నిలిచి,

`పార్టీని పటిష్ఠపరిచి,

`ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట చేసి,

`కాంగ్రెస్‌ ఎమ్మెలను గెలిపించి,

`బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకకుండా చేసి,

`పార్లమెంటు ఎన్నికలలో తనదైన ముద్ర వేసి

`పాలనలో ప్రత్యేక చూపి,

`అవినీతిని అంతం చేసే ప్రతిన బూని,

`శాఖలను ప్రక్షాళన చేసి,

`ప్రజా పాలన జనానికి చేరువ చేసి,

`జనం మెచ్చే పాలనకు బాటలు వేసి,

`కాంగ్రెస్‌లో తనదైన ముద్ర వేసి,

`ఖమ్మం ప్రగతిని పరుగులు పెట్టిస్తూ,

`ప్రజల చేత కీర్తింపబడుతూ…

`ఆరు నెలల్లోనే అద్భుత పాలన సాగిస్తూ…

`ఖమ్మం రాజకీయాలను శాసిస్తూ…

`ఎదురులేని నేతగా,

`తిరుగులేని శక్తిగా…

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక్కడుగా అడుగు మొదలు పెట్టి లక్షలాది మందిని ప్రభావితం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది అందిరకీ సాధ్యమయ్యే పని అసలేకాదు. రాజకీయ వ్యవస్ధను ప్రభావితం చేయడం అన్నది మాటలుకాదు. లక్ష్యసాధన మీద అకుంఠితమైనదీక్ష వుండాలి. ప్రజా జీవితంలో వున్న వారికి మంది ఎక్కువ వుండాలి. నాయకుల జీవితాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ప్రజలు చూసే కోణంలోనే కాదు, వారిని నమ్మే పద్దతిలో కూడా వైవిద్యముంటుంది. దానికి అనుగుణంగా నడుచుకుంటూ నిలిచి,గెలవడం అంటే అందరి వల్లకాదు. పైగా తన ఒక్కడి రాజకీయం కోసమే ఎంత మంది నాయకులు ఆపసోపాల పడుతున్న ఈ రోజుల్లో తనతోపాటు ఎంతో మంది రాజకీయ జీవితాలను కూడా ముందుకు నడిపించడం అంటే ఎంతో ధైర్యం కావాలి. అందుకు బలమైన విశ్వాసం కావాలి. ప్రత్యర్ధి రాజకీయాలను అధిగమించగలిగే ఆత్మస్ధైర్యం కావాలి. వారి మీద గెలిచేందు ఆత్మాభిమానం కలగాలి. అప్పుడే వేసే అడుగు, చూసే చూపు, చెప్పే మాటల్లో వాడి వేడి వుంటాయి. ప్రజలకు నమ్మకం కలిగిస్తాయి. ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తాయి. సరిగ్గా అలాంటి రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎందుకంటే ఆయన ఎంచుకున్న లక్ష్యం చిన్నది కాదు. ఒక జిల్లా మొత్తం మరో రాజకీయ పార్టీని భూస్ధాపితం చేస్తానని శఫధం చేసి, నెరవేర్చడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకే ఖమ్మం జిల్లా రాజకీయాలు మంత్రి పొంగులేటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయంటే అతి శయోక్తి కాదు. ఎప్పుడొచ్చామన్నది కాదు…బుల్లెట్‌ దిగిందా? లేదా? అని అదేదో సినిమాలో అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీలో ఇంత అతి తక్కువ కాలంలో క్రియాశీలకం కావడంలో పొంగులేటి కృషి ఎంత వుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటేనే ఒక పట్టుదలకు నిదర్శం. అందుకే పొంగులేటిని ఖమ్మమంతా జననేత అని కీర్తిస్తోంది. విజేతగా నిలిపింది.

ఒక నాయకుడు తొడగొట్టి నిలబడం అంటే రాజకీయాల్లో చాలా అరుదైన సంఘటనలుగానే చెప్పాలి.

ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో విలువైన పది సంవత్సరాల తన రాజకీయ జీవితాన్ని బిఆర్‌ఎస్‌కు అప్పగించి కోల్పోయారు. 2014లో వైసిపినుంచి ఎంపిగా గెలిచి, బిఆర్‌ఎస్‌లో చేరారు. తన రాజకీయ సేవలు అన్నీ బిఆర్‌ఎస్‌కు వశం చేశారు. తన సొంత నిధులతో ప్రజలకు ఎన్నొ పనులు చేసి పెట్టారు. బిఆర్‌ఎస్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టారు. అనేక త్యాగాలు చేశారు. బిఆర్‌ఎస్‌కోసం ఎంతో శ్రమించారు. కాని ఆయన సేవలు వాడుకొని, పొంగులేటి రాజకీయ జీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని అనుకున్నారు. అందుకే ఊరిస్తూ, ఊరిస్తూ, ప్రత్యర్ధి శిబిరాన్ని ప్రోత్సహిస్తూ, పొంగులేటిని బలహీనం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాధాన్యత తగ్గిసూ వచ్చారు. ప్రతిసారి భవిష్యత్తు వుంటుందంటూ ఊకదంపుడు ముచ్చట్లు చెబుతూ, పొంగులేటిని రాజకీయ ఎదగకుండా చేయాలని చూశారు. కాని బిఆర్‌ఎస్‌ పెద్దలు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. నిస్వార్ధపూరితమైన మనస్తత్వం వున్న పొంగులేటిని మోసం చేయడం దైవం కూడా సహించలేకపోయింది. అందుకే బిఆర్‌ఎస్‌ 2023 ఎన్నికల్లో నిండా మునిగింది. పొంగులేటి రాజకీయ జీవితాన్ని చిదిమేయాలని చూసిన బిఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో అడ్రస్‌ లేకుండాపోయింది. తెలంగాణలో అధికారం కోల్పోయింది. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన శపధానికి కూడా దేవతలు తదాస్తు అన్నారు. బిఆర్‌ఎస్‌కు 2023 ఎన్నికల్లో చుక్కలు చూపించేలా చేశారు. పొంగులేటి పవర్‌ ఏమిటో తెలిసేలా చేశారు. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే టైపులో బిఆర్‌ఎస్‌ను వీడిని పొంగులేటిని మళ్లీ మలుపుకోవాలని చూశారు. కాని కాంగ్రెస్‌కు మాటిచ్చి, పార్టీకి ఖమ్మంలో ఊపు తెచ్చాడు. జోరు పెంచాడు. మెజార్టీ స్ధానాలు గెలిపించాడు. బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నాడు శపధం చేశాడు. బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని కొన్ని లక్షల మంది ప్రజలు ముందు ప్రకటించాడు. అన్నంత పనిచేశాడు. అందుకోసం కొన్ని నెలల పాటు ప్రజలను చైతన్యం చేయడానికి అహర్నిషలు కృషి చేశాడు.

ఖమ్మం రాజకీయాల్లోనే ఎదురులేని నేతగా నిలిచాడు.

తిరుగులేని నేతగా ఆవిష్కరింపబడ్డాడు. ఇప్పుడు ఆయనకు ఎదురుగా రాజకీయం చేయాలంటే ఎంత పెద్ద నాయకులైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి ఏర్పడేలా తన దైన ముద్రను వేసుకున్నాడు. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్ధిపార్టీలైన బిఆర్‌ఎస్‌, బిజేపిలు పోటీ చేయమని ఎంత మంది నాయకులను ఒత్తిడి తెచ్చినా మా వల్ల కాదని పారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు పోటీ చేసిన అభ్యర్ధులు కూడా నమ్‌కే వాస్తే అన్నట్లు పోటీ చేశారే తప్ప గెలుస్తామన్న ప్రచారాన్ని కూడా బలంగా చేసుకోలేకపోయారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకుండానే కాలం గడిపారు. పార్లమెంటు ఎన్నికలు అనగానే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు మాట్లాడుకున్న మొదటి స్ధానం ఖమ్మం. అందులో ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎదురుండదు. మొదటగా గెలుపు కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేని నియోజకవర్గం కూడా ఖమ్మమే అని చర్చించుకున్నారు. ఖమ్మంలో పార్టీ ఎవరిని నిలబెట్టినా, పొంగులేటి వున్నాడన్న ఒక్క మాటతో విజయం నల్లేరు మీద నడకే అవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఖమ్మంలో పోటీ చేసేందుకు బిఆర్‌ఎస్‌, బిజేపిలలో ఎవరూ ముందుకు రాలేదు. బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపి. నామా నాగేశ్వరరావుకూడా నా వల్ల కాదని ఎంత బ్రతిమిలాడినా, కేసిఆర్‌ పట్టుబట్టి నిలబెట్టాడే గాని, గెలడానికి మాత్రం కాదని ఆయనకు కూడా తెలుసు. ఇలా జిల్లా రాజకీయాలను శాసించిన నాయకులు ఇటీవల కాలంలో ఎవరూ లేరు. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయాలను వైఎస్‌ శాసిస్తాడని అందరూ చెప్పుకునేవారు. ఎందుకంటే అలా కడప జిల్లా రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజలకు నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు సరిగ్గా పొంగులేటి కూడా అదే దారిలో నడుస్తున్నాడు. నమ్ముకున్న ప్రజల కోసం ఎంతో మేలు చేస్తుంటాడు. ఇప్పుడు మంత్రిగా ఖమ్మం జిల్లాను ప్రగతి పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారు.

పార్టీని ఇంకా పటిష్టపరిచే కార్యక్రమంలో వున్నారు.

ఖమ్మంను కాంగ్రెస్‌కు కంచుకోట చేసే పనిలో వున్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తనతోపాటు గెలిపించుకొని, బిఆర్‌ఎస్‌ను ఖమ్మంలో నామ రూపాలు లేకుండా చేశారు. ఇదిలా వుంటే పాలనతో కూడా తనదైన ముద్ర చూపిస్తున్నారు. తన శాఖల్లో ఎక్కడా అవినీవి వాసనలు లేకుండా చూస్తున్నారు. ముఖ్యంగా రెవిన్యూ వ్యవస్ధలో అవినీతిని రూపు మాపేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అవినీతికి అలవాటు, ప్రజలను దోచుకుంటున్న వారు ఒక్కొక్కరూ పట్టుబడుతున్నారంటే పొంగులేటి మార్కు పాలన ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అవినీతి మరకలు అంటకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి ఇలా కొరఢా రaులిపిస్తాడని తెలియక, ఇప్పటికీ అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో అదికారుల పట్టుడడ్డారంటే తన శాఖల ప్రక్షాళన కోసం ఎంత మంత్రి ఎంత సీరియస్‌గా వున్నారో చేసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రజలను వేదించేవారెవరైనా, లంచాలు తీసుకోవాలంటే భయపడేలా చేస్తున్నారు. తన మార్కు పాలన చూపిస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో మంత్రి పనిచేస్తున్నారు. ప్రజల మేలు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలైనా సరే అమలు చేసేందుకు సిద్దమయ్యారు. తన శాఖల్లో అవినీతి వార్తలేని వ్యవస్ధ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. లంచం అన్న మాట వినిపించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇతర మంత్రుకు కూడా ఆదర్శమౌతున్నారు. దటీజ్‌ పొంగులేటి అని కొన్ని తరాలు చెప్పుకునేలా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *