
మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ
నిజాంపేట, నేటిదాత్రి
రైతులు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకుంటే నేల బౌతిక స్థితి మెరుగుపడి గుల్లగా మారుతుందని నిజాంపేట్ మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తేలిపారు. ఈ రోజు నిజాంపేట్ మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు పచ్చి రొట్ట ఎరువుల పంపినిని ప్రారంబించారు. రైతులకు పచ్చి రొట్ట ఎరువులు 60% సబ్సిడీ పై నిజాంపేట్ మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం , డి సి ఎం ఎస్ లోఅందుబాటులో ఉన్నాయని రైతులు పచ్చిరొట్ట వేయడం వల్ల ఎకరానీకి 10 టన్నుల పచ్చి రొట్ట ఏరువు లబిస్తుంది .60 కిలోల నత్రజని , 15 కేజీల భాస్వరం , 50 కేజీల పొటాష్ భూమిలో కలుస్తుందన్నారు. పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల నేల బౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుందని ,నెలలో సేంద్రీయ పదార్థం పెరగడo వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెంది, జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాక , నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటుందని చెప్పారు . భూమిలో రసాయన ఎరువులు వేసినపుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగ పడతాయన్నారు . కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చని , చౌడు భూముల పునరుద్దరణకు ఉపయోగపడుతుందన్నారు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీలత, కావేరి మరియూ రైతులు పాల్గొన్నారు .