
మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కొండు బానేష్
మంచిర్యాల, నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో 60శాతం దొడ్డు వడ్లను పండిస్తున్న రైతాంగాన్ని ద్రుష్టిలో కి తీసుకొని క్వింటాకు 500బోనస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాన కాలం సీజన్లో సన్న వడ్లను 500రూపాయలు బోనస్ ప్రకటించటం, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సన్న రకాల వడ్లను సేకరించాలని తీసుకున్న నిర్ణయము హర్షనీయం 25రకాల సన్న వడ్లను పండించ టానికి రైతాంగం కృషిని కొనసాగిస్తున్నారు.
హెచ్ ఎం టి – జె ఎస్ ఆర్ మహేంద్ర బి పి టి రకాలు కూడా ఎకరానికి 25,28,30, క్వింటాలు దిగుబడి వస్తుంది. సన్న రకాల వడ్లకు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో మార్కెట్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే పంట రాగానే పచ్చి వడ్లనే మిలర్స్ ఎం ఎస్పీ కంటే ఎక్కువగా ధర పెట్టికొనుగోలు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలలో మార్కెట్ లో దొడ్డు రకం వడ్లను సాగుచేస్తున్న రైతాంగం సాగు ఖర్చు తక్కువగా ఉంటుంది. అని వాతావరణం ఎట్లా ఉన్నా పండించు కునే అవకాశాలు ఎక్కువగా వస్తుంది అన్న ఆలోచనతో సాగు చేయడం జరుగుతుంది.ఈ పంట ను ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు.తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పటం హర్షనీయo దొడ్డు రకాల సాగుపై తెలంగాణలో అన్ని జిల్లాలలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వారిని చైతన్య వంతం చేయటం ద్వారా ఏ ఏ ప్రాంతాలలో సన్న రకాలు సాగు చేయాలి దీనిపై పూర్తి అవ గాహన కల్పించడానికి ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి. 60శాతం ప్రస్తుతం దొడ్డు రకాలు సాగు చేయటం జరిగింది. క్రమక్రమంగా లాభసాటిగా ఉన్న సన్న రకాల ను పండించ టానికి ప్రభుత్వం రైతాంగంలో అవగాహన కల్పించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.ప్రస్తుతం దొడ్డు రకం వడ్లకు 500బోనస్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏ ఐ కే ఎస్)
మంచిర్యాల జిల్లా కార్యదర్శికొండు బానేష్ కోరారు.