
జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో మరియు ఇందారం, ముదిగుంట గ్రామపంచాయతీలను బుధవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి .వెంకటేశ్వరరావు సందర్శించడం జరిగింది. జైపూర్ మండల కేంద్రంలోని గ్రామాలలోని సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి కంపోస్ట్ పిట్ లో కంపోస్ట్ ఎరువును తయారి విదానమును పరిశీలించి, కంపోస్ట్ పిట్ నందు వానపాములు బ్రతికి ఉండేలా చూడాలని సూచించడం జరిగింది. కంపోస్ట్ ఎరువు తయారు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం లోని మొక్కలకు వినియోగించాలని మరియు కంపోస్ట్ ఎరువును విక్రయించి అట్టి రూపాయలను గ్రామ పంచాయితీ సాధారణ నిధిలో జమచేయాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్లపై ప్లాస్టిక్ లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం చేయుట, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామ పంచాయితిలను పరిశుభ్రంగా ఉండే విదంగా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. సేకరించిన డ్రై వేస్ట్ ను, ప్లాస్టిక్ వస్తువులను విక్రయించి అట్టి రూపాయలను గ్రామ పంచాయితీ సాధారణ నిధిలో జమచేయాలని సూచించడం జరిగింది. మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శి డి.వెంకటేశ్వర్ రావు. జైపూర్ మండలం పంచాయతీ అధికారి జి.అనిల్ కుమార్, ముదిగుంట గ్రామపంచాయతీ కార్యదర్శి పి.సురేష్, జైపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్,
మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది ఉన్నారు.