
యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మొగుళ్ళపల్లి, 21మే:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ మే 27 న జరిగే వరంగల్, ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మొగుళ్లపల్లి మండల పరిధిలో 1468 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని వారిని కోరాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే నిరుద్యోగ యువతకు,ఉద్యోగులకు అన్ని విధాలుగా న్యాయం చేకూరుతుందన్నారు.ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మల్లన్న ఉంటాడు కాబట్టి అందరికి న్యాయం జరగాలంటే ఈ ఎన్నికల్లో మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే మల్లన్న గెలుపు ఖాయం అయిపోయింది కేవలం ఇప్పుడు భారీ మెజారిటీ కోసమే ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు బనాయించి,జైలుకు పంపిన కూడా ప్రభుత్వ అవినీతి ఆరాచకాలను వెలికి తీసి ప్రజల ముందు ఎండగట్టిన ప్రశ్నించే గొంతుక ఏదైనా ఉందంటే అది తీన్మార్ మల్లన్న మాత్రమేనని అన్నారు