రైతులను దగా చేస్తే సహించొద్దు.తుడుందెబ్బ అధికారులకు వినతి.

గంగారం, నేటిధాత్రి :
రానున్న వ్యవసాయ కాలంలో రైతులకు కావాల్సిన అన్నీ రకాల ఎరువులు,విత్తనాలు పురుగు మందుల అమ్మకాల్లో ప్రభుత్వ నిర్ణయ ధరలను అతిక్రమించి అమ్మకాలు జరుపుతే విక్రయ దారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కొత్తగూడ తహసీల్దార్,అగ్రికల్చర్ అధికారులకు మెమో రాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్న తుడుందెబ్బ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి,మాట్లాడుతూ కొత్తగూడ,గంగారం మండలాలలో వడ్డీ వ్యాపారులు ఇష్టా రాజ్యాంగ దోపిడీ చేస్తూ అక్రమ సంపాదనే ద్యేయం గా ముందస్తుగా వ్యవసాయ కాలం కు ముందుగానే విత్తనాలు,ఎరువులను దిగుమతి చేసి అక్రమ వడ్డీ వేసి దోపిడీ చేస్తున్నారని ఇది అధికారులకు తెలిసినా అక్రమార్కుల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వడ్డీ వ్యాపారులకే కొమ్ముకస్తున్నారని ప్రభుత్వ ఆగ్రోస్,ODMS కౌంటర్ లు ఉన్నా అవి రైతులకు నిరూపయోగం అవుతున్నాయని ఈ కౌంటర్ లకు దిగుమతి అవుతున్న ఎర్వులు,విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేయగా అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలియచేశారు కార్యక్రమం లో ఈక విజయ్,కల్తీ లచ్చయ్య,సుకెందర్,లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!