గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలం పనుల కోసం వెళ్లే రైతులు చెరువులో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళవద్దని ఈ అకాల వర్షాల వల్ల రోడ్డుపైన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే సమయంలో గాలి దుమారాంకు చెట్లు విరిగి అవి మీ పైన పడవచ్చు విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు కింద పడవచ్చు రోడ్డుపై వెళ్లి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మెరుపులు వచ్చినప్పుడు చెవులు మూసుకుని మోకాళ్ళ పైన కూర్చోవాలి అప్పుడు పిడుగులబారిన పడకుండా ఉంటారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సామామూర్తి కోరారు.