వనపర్తి నేటిదాత్రి :
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ అన్నారు
గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్బంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుం డి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి చేరకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో ఎలాంటి నీరు నిల్వ గానీ, కొబ్బరి చిప్పలు గానీ, పాత టైర్లు గానీ లేకుండా చూసుకోవాలని సూచించారు. కూలర్లు వాడే వారు ఎప్పటికప్పుడు అందులో నీటిని మారుస్తూ శుభ్ర పరచుకోవాలని చెప్పారు.
పగటి పూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదని తెలిపారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రి కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డి. ఎం. హెచ్. ఓ శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు