
నర్సంపేట,నేటిధాత్రి :
బుల్లితెర జబర్ధస్త్ ఫేం కెవ్వు కార్తీక్ కు మాతృవియోగం జరిగింది. తన మాతృమూర్తి ఓడపల్లి కరుణ(56) గత కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కార్తీక్ బుల్లితెర ద్వారా పరిచయం అయ్యి అనతి కాలంలోనే జబర్ధస్త్ ప్రోగ్రాంతో తన నటనతో హాస్యంతో “కెవ్వు కార్తీక్” గా అలరించి మంచి పేరు సంపాదించుకున్నారు. కార్తీక్ తండ్రి యాదగిరి ఆర్టీసీ నర్సంపేట డిపోలో కండక్టర్ గా సుదీర్ఘంగా పని చేసి 2017లో పదవీ విరమణ పొందారు. కార్తీక్ తల్లి కరుణ పార్దీవ దేహానికి ఫిలింనగర్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని కార్తీక్ తండ్రి యాదగిరి తెలిపారు.