ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కల్లూరు ఊరేగింపులో
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో బీఆర్ఎస్ ఊరేగింపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వాన కల్లూరు మండల కేంద్రం మెయిన్ రోడ్డులో నిర్వహించిన ఊరేగింపులో స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
డప్పుల దరువు,డీజేలు,మహిళలు కోలాటం ఆడుతూ,యువత కేరింతలు కొడుతూ, నినాదాలిస్తూ అతిథులకు అపూర్వ స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
కాంగ్రెస్ పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది
కరెంట్,సాగు,తాగునీళ్లు ఇవ్వలేని ఆ పార్టీ నాయకులకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు
సత్తుపల్లి నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి,ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడిన, ఎల్లవేళలా అందుబాటులో ఉండే సండ్ర వెంకటవీరయ్య ఓడిపోవడం తీవ్ర బాధాకరం
మన ఎంపీ అభ్యర్థి, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు పక్కా లోకల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడును ఒప్పించి లేఖ ఇప్పించిన నాయకులు నామ
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు నామ మొట్టమొదటి ఓటు వేశారు
ఖమ్మం జిల్లా గుండా పోతున్న జాతీయ రహదారుల మంజూరునకు నామ,నేను, పార్థసారథి రెడ్డి, వెంకటవీరయ్య కృషి ఉంది
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడినం
తెలంగాణకు రావలసిన పథకాలు,నిధుల గురించి పోరాడినది,పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలమే
నామ నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ నుంచి 12మంది ఎంపీ గెలవడం తథ్యం
మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ నామకు భారీ ఓట్ల మెజారిటీ తీసుకువద్దాం
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”, “గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపిద్దాం” అనే నినాదాలతో కల్లూరు దద్దరిల్లింది