టిపిసిసి కోఆర్డినేటర్ రవీందర్
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకుడు మాట్ల రమేష్,బి ఆర్ ఎస్ నాయకులు మౌతం కుమారస్వామి,మాజీ ఉపసర్పంచ్ మౌటం రమేష్ , సీనియర్ నాయకులు, చందుపట్ల నరసింహ రెడ్డి, అంకుష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,పుల్ల రామ స్వామి, ఐలయ్య, వెంగళ విజయ్,మాట్ల కుమార్, నాయకులు,మాట్ల సాగర్, జన్ను రమేష్, బిజెపి శనిగరపి రాజేందర్ , కిన్నెర బిక్షపతి ,గందసిరి అనిల్,వారాల శ్రీనివాస్ తదితరులను టి పి సి సి కోఆర్డినేటర్ తవుటం రవీందర్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తానని అన్నారు.మాజీ ఎం పీ టి సి మౌటం కుమార్ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్కార్ అశోక్, ప్రసాద్, చంద్రశేఖర్, సాంబయ్య, ఆడెపు శ్రీకాంత్, బండి ప్రశాంత్ ,తదితరులు తదితరులు పాల్గొన్నారు.
