#కాంగ్రెస్ పార్టీలో చేరిన కన్నారావుపేట ఎంపీటీసీ రవీందర్.
#ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని కన్నారావుపేట, రంగాపురం, నారక్క పేట, బోలోని పల్లె గ్రామాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ కన్నారావుపేటఎంపీటీసీ ఏడాకుల రవీందర్, యం వి పల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి తో పాటు మండల స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే దొంతి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు హామీలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించి అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, కర్దూరి కట్టయ్య, డేగల కృష్ణ, ఇంద్రారెడ్డి, పెంతల కొమరారెడ్డి, నల్లగొండ సుధాకర్, చెంచు కుమారస్వామి, బైరి వెంకట్, మాజీ సర్పంచ్ ఎరుకల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.