గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఇండియన్ మెజీషియన్,గిన్నె బుక్ రికార్డ్ హోల్డర్ & సెంట్రల్ బోర్డ్ సినిమా సెన్సార్ సభ్యుడు సామల వేణు పాల్గొని మున్నూరు కాపు సభ్యులకు దిశనిర్దేశం చేశారు.ప్రముఖ ఇండియన్ మెజీషియన్ సామల వేణు మాట్లాడుతూ మున్నూరు కాపులు విద్యారంగంలోనూ,రాజకీయంగాను తదితర రంగల్లోనూ అభివృద్ధి సాధించాలని అన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,మున్నూరు కాపు సభ్యులందరూ ఐక్యతతో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరడం జరిగింది.అనంతరం మున్నూరు కాపు మాజీ వార్డ్ సభ్యులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్,మున్నూరుకాపు యూత్ఫోర్స్ వ్యవస్థాపకుడు రాళ్లబండి రామకృష్ణ, మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు పడాల జలంధర్,గౌరవ అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి,గురిజాల బుచ్చిరెడ్డి,పుప్పాల మహిపాల్, పడాల సుదర్శన్,పడాల సత్యం,పడాల తిరుపతి,పడాల రాకేష్,కట్ట సత్తన్న,తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
