గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఈర వేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 10 నుంచి ఈనెల 31 లోగా www.tsmodalschools.com వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారం ను పాఠశాలలో సమర్పించవలెను. ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి నాలుగు గ్రూపులలో ఒక్కొక్క గ్రూప్ కి 40 సీట్లు అందుబాటులో కలవు. మోడల్ స్కూల్ లో అత్యున్నత ప్రమాణాలు గల అధ్యాపక బృందం చేత ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కలదు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ సప్లై చేయబడును. అదునాతన సైన్స్ ల్యాబ్ లు – బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్ లు, విద్యార్థులందరికీ కళాశాలలో ఎంసెట్, నీట్, జేఇఇ కోచింగ్ ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. ఈ సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపల్ ఇరవేణి రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
గొల్లపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
