
హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?
20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా?
హిందువులారా…. మీ సత్తా ఏందో కేసీఆర్ కు మళ్లీ రుచి చూపించండి
కేసీఆర్… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా….
వినోద్ ఓడిపోతే… బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా?
నా వెనుక 80 శాతం హిందువులున్నారు….
బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పండి
కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదు
కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది
ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?
కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు
కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే
ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడివి కేసీఆరే
రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు కేసీఆరే
ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్న దగుల్బాజీ కేసీఆర్
తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
చర్చకు సిద్ధమైతే… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం
కేసీఆర్ తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం
ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్
ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్
అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..
సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా…
బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?
విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా?
రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది?
తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది
కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ ను ఖండిస్తున్నా
కేటీఆర్… నీకు సిగ్గుంటే నీ అసలు పేరు పెట్టుకో
నీకు దమ్ముంటే… నీ పేరులోని రాముడి పేరును తీసేసి మాట్లాడు…
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్
సిరిసిల్ల, మే – 10(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం లోని స్థానిక లహరి ఫంక్షన్ హాల్లో బిజెపి పోలింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై బీ అర్.ఏస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు మాట్లాడుతూ…. ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ చేసిన తీవ్రస్థాయిలో స్పందించారు.
20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.
‘‘హిందూ సమాజమంతా తన వెనుకుందనీ,తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కరీంనగర్ లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.
దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
‘తెలంగాణకు రూ.10 లక్షల కోట్లదాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది అని అన్నారు. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించేందుకు సిద్ధం’’అని పేర్కొన్నారు.
కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరని చెప్పిన సంజయ్… ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతోపాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుకు రూ.5 వేల చొప్పున, రూ.2 వేల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. హిందువులంతా… కేసీఆర్ వ్యాఖ్యలపై మీ సత్తా ఏందో చూపాలంటూ పిలుపునిచ్చారు.
జవాన్ల త్యాగాలను కూడా కెసిఆర్ విస్మరిస్తున్నాడని ,
కెసిఆర్ ది ఏ దేశమో చెప్పలన్నారు. సిరిసిల్ల కలెక్టర్ చిన్న వాన తుంపర్లకే మునిగి పోతోంది. అవినీతికి అధిపతి కేసిఆర్ అని అన్నారు.
కాళేశ్వరం డిపిఆర్ గురించి విజ్ఞప్తి చేస్తే ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా కేంద్రాన్ని బద్నాం చేసిన వ్యక్తి కేసిఆర్ అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నవ్వుల పాలు అయ్యేలా చేసిన వ్యక్తి కేసిఆర్ నే అని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ పైసలను కాంగ్రెస్ కరీంనగర్ లో పంచుతుందన్నారు.
కేసిఆర్ మూర్ఖత్వం, అరాచకం వల్ల తెలంగాణలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు అభివృధి చేస్తామని కేంద్రం తరఫున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడు కేసిఆర్. కేటీఆర్ ఏమో జై శ్రీరామ్ అనొద్దని అంటారు. తండ్రి ఏమో ముస్లింలు అంతా ఒక్కటి కావాలని అంటుండు. కరీంనగర్ అభివృద్ది పై నేను మాట్లాడుతుంటే.. కేసిఆర్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ముస్లిం మత పెద్దలతో కేసిఆర్ కుమ్మక్కేనాడు. 80 శాతం ఉన్న హిందువుల గురించి కేసిఆర్ మాట్లాడటం లేదు. కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా… కరీంనగర్ లో వినోద్ రావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? కేటీఆర్ కు సిగ్గుంటే… ఆయన అసలు పేరు అజయ్ రావు అని పెట్టుకోవాలి. అద్దె పేరైన కేటీఆర్ లోని రాముడి పేరును తీసేసి మాట్లాడాలి…
హిందువుల గురించి హేళన చేస్తున్న కేసిఆర్ కు బుద్ది చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవశ్యకత ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. కేసిఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. బీఆర్ స్, కాంగ్రెస్ నేతల్లారా.. మీ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒక్కసారి గమనించండి. నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ వాదిని.అదే వాళ్లు మాట్లాడితే సెక్యులర్ వాదులు. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోంది. భైంసా లో హనుమాన్ భక్తులు కేటీఆర్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను చనిపోయారని కేసిఆర్ హేళన చేయడం బాధాకరం. హిందువులను హేళన చేయడం కేసిఆర్ కి పరిపాటిగా మారింది. కేసిఆర్ హిందూ సమాజానికి పక్కా క్షమాపణ చెప్పి తీరాలి. ఫామ్ హౌస్ లో పిరికి పందలెక్క పడుకుంటే.. పోలీస్ వలయాన్ని ఛేదించి చార్మినార్ భాగ్యలక్ష్మి సాక్షిగా సవాల్ చేసిన వ్యక్తిని నేను. పార్టీల జెండాలను పక్కన పెట్టండి. హిందువులంతా ఏకం కావాలి. ఓటు బ్యాంకుగా మారాలి. బీజేపీ గొడుగు కిందకు రండి.