# టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్.
నర్సంపేట,నేటిధాత్రి :
కేంద్రంలో బీజేపీ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు భవిష్యత్తు ఉండదని అలాగే దళితులకు గిరిజనులకు బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు పోయే ప్రమాదముందని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5,6,7,8,10,11,18,19 వార్డుల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పాల్గొన్నారు. మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చి రిజర్వేషన్లు రద్దు చేద్దామని చూస్తుందని ఆరోపించారు.బీజేపీకి ఓటు వేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టేనని పేర్కొన్నారు. బిఅర్ఎస్ పార్టీకి పొరపాటున ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసిన్నట్టేనని చెప్పారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తుందని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణతో తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాట రఘు, పంబి వంశీకృష్ణ, జూలపెల్లి రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మోటం రవికుమార్, నాడెం నాగేశ్వర్, చింతల క్రాంతి రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కొల్లూరి మధుకర్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు పోతరబోయిన చంద్రమౌళి నాయకులు పాల్గొన్నారు..
# కాంగ్రెస్ ను గెలిపిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుదాం…..
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం అని మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్ లో నర్సంపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ బిజెపి, బీఆర్ఎస్ ఒకటేనని బీఆర్ఎస్ కు ఓటేస్తే అది బిజెపికే పోతుందని అన్నారు.ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు దండెం రతన్ కుమార్, ఎన్ఎస్ఈఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, బీసీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యువజన నాయకులు దేశి సాయి పటేల్, డివిజన్ అధ్యక్షులు కోయా శ్రీనివాస్, కార్యదర్శి తొగరు దేవేందర్, యూత్ అధ్యక్షులు జిజుల కార్తీక్, యూత్ నాయకులు దేశీ సందీప్, రాస మల్ల బాలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.