# ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన కౌశిక్ రెడ్డి
# ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడు రేవంత్ రెడ్డి
# ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధం
# రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్
# వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం
వీణవంక,( కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని కొండపాక గ్రామంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు. మహిళలకు 2500 పెన్షన్, రైతులకు రుణమాఫీ, 500 రూపాయల బోనస్ లాంటివి ఆరు గ్యారెంటీలలో లేవా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో ఒకటి కూడా అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి వినోద్ కుమార్ ను గెలిపిస్తే పార్లమెంటులో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాలన్నారు. వినోద్ కుమార్ ను గెలిపిస్తే ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయం పట్టుకుందని, అందుకనే కావాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రోడ్ షోలను అడ్డుకుంటున్నారని అన్నారు. ఆదివారం వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసములో ప్రజల ఆత్మీయ సమ్మేళనం సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభలో చాలా మంది జనాలు వచ్చినారు. మన జననేత కెసిఆర్ చెప్పిన విషయాలు కూడా మీరు విన్నారు అదేవిధంగా నేను ఎమ్మెల్యే ఎలక్షన్ లో నన్ను గెలిపిస్తే భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపనకు విగ్రహాలు లక్ష రూపాయలు విరాళంగా అందజేస్తాను మీకు మాటా ఇచ్చినాను కాబట్టి అదే విధంగా మీ గ్రామ నాయకుల ముందు ఉపాధి హామీ కూలీల ముందు 100000/- లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బాల బాలకిషన్, ముసిపట్ల తిరుపతిరెడ్డి, కామెడీ శ్రీనివాస్ రెడ్డి, కాసర్ల సుధాకర్, రామగుండం రాజకుమార్, ఈదునూరి భూమయ్య, నల్లగాస శ్రీనివాస్, మ్యడగోని శ్రీనివాస్ గట్టు మధు, సమ్మయ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.