
– సింగిల్ విండో చైర్మన్ ప్రశాంత్ రెడ్డి
కాటారం నేటి ధాత్రి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గారెపల్లి (కె ) ఆధ్వర్యంలో రబి సీజన్ కోసం ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సింగిల్ విండో చైర్మన్ తోటపల్లి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సహకార సంఘం కార్యాలయంలో హమాలీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీలా సంఖ్యను పెంచి హమాలీలా కొరత లేకుండ చూడాలని, గతంలో కంటే కాంటాలను పెంచి త్వరతిగతిన లోడ్ లు చేసి పంపిచాలని సూచించారు. గన్ని సంచల కొరత రాకుండా, రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని పేర్కొన్నారు. ఈ సమావేశం లో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి డైరెక్టర్ దండ్రు రాజయ్య, సీఈఓ ఎడ్ల సతీష్, హమాలీ మేస్త్రి లు లింగయ్య,బుచ్చయ్య, మల్లయ్య, సమ్మయ్య, శ్రీనివాస్, మల్లయ్య, రాజేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు