
హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరిలో పెంబర్తి గ్రామ ఉప సర్పంచ్ ఉట్కూరి సునీల్ మరియు నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మరియు హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్ రామ్ నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు పెంబర్తి గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ తిరుపతి మాజీ మండల అధ్యక్షులు మదన్ గౌడ్ మండల మహిళా అధ్యక్షురాలు జోర్కపూల మండల్ యూత్ కాంగ్రెస్ సౌరం చరణ్ తేజ జిల్లా ఎస్ఎస్సిఎల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.