పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి..
పాలమూరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సోమవారం రోజు బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం ముగించుకొని వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని మార్కెట్ యార్డ్ నందు రాత్రి కురిసిన వర్షానికి భారీ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అనడానికి ప్రత్యేక నిదర్శనం ఈ తడిసిన ధాన్యం అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్లాలల దగ్గరికి వెళ్లి ప్రతి గింజ కొన్నాంమని .తడిసిన ప్రతి గింజకూ సమాంతర ధర కట్టించి రైతులను అదుకున్నాం అని తెలియజేశారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు అరి గోస పడుతున్నారని,రైతు బంధు,రైతు భీమా,పండిన పంటకు బోనస్,24 గంటల కరెంట్ ఇంకా ఏవి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు..
తప్పకుండా తడిసిన ప్రతి గింజ కొనెవరకు రైతులకు మద్దతుగా ధర్నాలు చేసి రైతులకు అండగా ఉంటామని వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్ దే నని
నేడు రైతులను పట్టించుకోకుండా మార్కెట్ యార్డ్ కు తాళాలు వేసి బయట నిల్చోబెట్టి అవమనపరుస్తున్నారని మండిపడ్డారు.
ఇక నైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారిని అదుకునేవారకు పోరాడుతూనే ఉంటాం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.