
– గడపగడపకు బి.ఆర్.ఎస్ పార్టీ ప్రచారం
సిరిసిల్ల, మే – 7(నేటి ధాత్రి):
పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక మూడో వార్డులో మంగళవారం భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బోయిన్పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ఉద్యమంలో మరియు తెలంగాణ హక్కుల సాధనకై చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు..
వీరి వెంట వార్డ్ అధ్యక్షులు మెర్గు శేఖర్, గోషిక శ్రీనివాస్, దూస ఈశ్వరి,
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూస రాజేశం, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు…