పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వేములవాడ నేటిధాత్రి

వేములవాడలోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2003-2004 ఘనంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతా విద్యా సంస్థల పూర్వపు అధినేత అయాచితుల రాంప్రసాద్ దంపతులను స్మరిస్తూ విద్యార్థులందరూ సంతాపం ప్రకటించి విద్యార్థులకు తాను చేసినటువంటి మేలు, విద్యాభ్యాసం,సమున్నత వికాసానికి, అభివృద్ధికి తోడ్పడిన విషయాలను గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. 20 సంవత్సరాల తర్వాత కలిసిన తన తోటి మిత్రులు మరియు విద్య నేర్పిన గురువులను చూసి చాలా ఆనందించారు ఆటపాటలతో ఆలారించారు. 20 సంవత్సరాల తర్వాత ఓకే వేదికపై చాలా ఆనందంగా ఉందని ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రస్తుత గీతా విద్యాసంస్థల కరస్పాండెంట్ అయాచితుల జితేందర్ రావు పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయాల వల్ల చాలామంది విద్యార్థులు భవిష్యత్తు అద్భుతంగా ఉందని ఆయన నేర్పిన విద్యాబుద్ధులు, పెద్దలపట్ల సత్ప్రవర్తన కలిగి ఉండటం ప్రతి విద్యార్థి మంచి అవకాశాలు అందించుకొని ఉన్నత స్థానాలకు చేరారన్నారు.చాలా మంది పోలీసులుగా, తాసిల్దార్లుగా, అడ్వకేట్లుగా, రాజకీయ నాయకులుగా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఎదిగారాన్నారు.నేను కూడా గీతా విద్యాసంస్థల పూర్వ విద్యార్థిని అని గుర్తు చేశారు. తన తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రస్తుతం విద్యా సంస్థలను కొనసాగిస్తున్నట్టుగా, ఎందరో విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఇలా అందరినీ ఒకే వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు అధ్యాపకులను మెమెంటులతో,శాలువాలతో గౌరవించారు. కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు, నామాల ప్రదీప్ కోయినేని రాజేందర్, కొడం గంగాధర్, పిట్టల శ్రీనివాస్, వేణు,సంతోష్ .రమణారెడ్డి.బాబు. శ్రీకర్ .లక్ష్మణ్.అజయ్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!