* ఉద్యమంలో లేని వారు,నేడు రాజకీయాలు చేస్తున్నారు.
* రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దిగజారోద్దని హితవు.
– కేటీఆర్, కెసిఆర్ మాటలు నమ్మొద్దు
సిరిసిల్ల, మే – 6(నేటి ధాత్రి):
“రాజన్న సిరిసిల్లా జిల్లా” ఉద్యమకారుల ఫలితమని, జిల్లాను మార్చే యోచన ప్రభుత్వానికి లేదని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ (టోని) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మార్చుతున్నారంటూ ఓ బి.ఆర్.ఎస్ నాయకుని వ్యాఖ్యలను ఖండిస్తూ, సోమవారం ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వ్యతిరేకిస్తూ, మంగళవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టోని మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏత్తివేస్తే, కాంగ్రెస్ నాయకులను జిల్లాలో తిరగనీయమని ఓ బి.ఆర్.ఎస్ నాయకుడు అనడం హస్యస్పదమన్నారు. సిరిసిల్లా జిల్లా కోసం ఉద్యమం చేసింది ఇప్పుడు కాంగ్రేస్ పార్టీలో ఉన్న నాయకులేనని, అప్పుడు బిఆర్ఎస్ నాయకులు మమ్మల్ని జెైళ్ళకు పంపారని గుర్తుచేశారు. అసలు కేటిఆర్ సిరిసిల్లా జిల్లా ఏర్పాటుకు సుముఖంగా లేడని, జిల్లా ఇవ్వకుంటే కేటిఆర్ ను జిల్లాలో తిరగనివ్వరని, ఓట్లు వేయరని భావించి జిల్లా ఏర్పాటుకు సహకరించారే తప్ప మనసుస్పూర్తితో కాదని తెలిపారు. బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజల్లో పల్చబడిందని, జిల్లాలో నామరూపాలు లేకుండా పోతుందని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేటీఆర్ చెంచాలు వేస్తున్న చిల్లర వేషాలని పేర్కొన్నారు. జిల్లా సాధనలో అనేక మంది నాయకులు, యువకులు జైళ్ళకు వెళ్ళారని అప్పుడు మీరేక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రజలు బి.ఆర్.ఎస్ ను మర్చిపోయారని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీకి ఒక్క సిటు రాదని, ఇలా దిగజారి ప్రవర్తించొద్దని హితవు పలికారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఏర్పాటుకు ప్రస్తుతం సి.ఎం రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు పలికిన వ్యక్తి ఎలా జిల్లాను ఎత్తేస్తారో బి.ఆర్.ఎస్ నాయకులు తెలపాలని ప్రశ్నించారు. కేటిఆర్, కేసిఆర్ లు మాట్లాడేవన్ని అబద్దాలేనని ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రేస్ నాయకులు బైరినేని రాము, కంసాల మల్లేశం, లింగంపెల్లి మధూకర్ , సోమిశేట్టి ధశరథం, పోకల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.