
వారిపై చర్యలు ఉంటాయా….?
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిసింది వారు ఎన్నికల నియమావళి తెలిసి ఉల్లంఘిస్తున్నారా, లేదా తెలవకనా, మాకు రాజకీయ బలం ఉందని అనుకుంటున్నారా, లేదా ఆ నాయకులకు భయపడి ప్రచారంలో పాల్గొంటున్నారా అనేది మండలంలో ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదని ఎన్నికల నియమావళి చెబుతుంది కానీ మండలంలో ఆ నియమావళి వీళ్లకు వర్తించటం లేదా అనేది సందేహం, గతంలో సిద్దిపేట జిల్లాలో కొందరు ఉద్యోగులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే, అది తెలిసి కూడా ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారంటే వారికి ఎంత ధీమా ఉందో తెలుస్తుంది ఏది ఏమైనా ఎన్నికల ప్రచారాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం అనేది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది, ఇప్పటికైనా ఎలక్షన్ అధికారులు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఏ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు వారిపై నిఘ పెట్టవలసిన అవసరం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఉన్నతాధికారి సమాచారం పంపించారనేది విశ్వనీయ సమాచారం, ఏది ఏమైనా తదుపరి చర్య ఉంటుందా చర్యలు ఉండవా అనేవి వేచి చూడడమే.