
గొల్లపల్లి నేటి ధాత్రి :
గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో శుక్రవారం రోజున రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత నర్సాపురం రవీందర్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దని సూచించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నర్సాపురం రవీందర్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాడూరి సత్యనారాయణ, అంబేద్కర్ సంఘ నాయకులు మద్దెల గోవర్ధన్, చెవులమాద్ది మల్లేశం, గంగాధర మధుసూదన్,గడుగు విజయ్, ఆటో యూనియన్ సభ్యులు రాజయ్య, గంగన్న, కిరణ్, అశోక్, పుర ప్రముఖులు అంకం భూమన్న, శాతల్ల లక్ష్మణ్, జెరిపోతుల అనిల్, కలకోట సత్యం,శ్రీధర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.