
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని వెదిర, వెలిచాల, కొక్కెరకుంట, వన్నారం, రుద్రారం, రంగసాయి పల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ప్రయాణం, 500రూ.లకే సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, వచ్చే ఆగస్టు15 లోపు మిగిలిన గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కులం మతాల పేరుతో ప్రజలను యువతను రెచ్చగొట్టడం తప్ప, పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చేసినది ఏమీ లేదని, స్థానికుడు, సౌమ్యుడైన రాజేందర్రావును గెలిపించుకుంటే ఈప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజల మధ్యనే ఉంటూ, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపీపీ జవ్వాజి హరీష్, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, వెన్నం రాజమల్లయ్య, పులి ఆంజనేయులు గౌడ్, బండపెల్లి యాదగిరి, నేరెళ్ల ఆంజనేయులు గౌడ్, కాడే శంకర్, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.