గ్రామ మాజీసర్పంచ్ భూక్యా రమేష్
, శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో కీర్తిశేషులు గుగులోతు నరహన్ జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను సూర్య నాయక్ తండ మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గుగులోత్ శంకర్ తండ్రి అయిన నరహాన్ జ్ఞాపకార్థం కోసం సూర్య నాయక్ తండలో బస్ షెల్టర్ నిర్మించడం జరిగిందని అన్నారు.ఉన్న ఊరికి ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనలతో మరియు తండ్రి మీద ప్రేమతో బస్సు షెల్టర్ నిర్మాణం చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.బస్ షెల్టర్ నిర్మాణం కోసం 92,000 రూపాయలు నిర్మాణం చేపట్టడం జరిగింది..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ మూర్తి,లింగునాయక్,రాజు,అజ్మీరా దూదా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లావుడు రవీందర్ పాల్గొన్నారు.