ముత్తారం :- నేటి ధాత్రి
మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మే డే ను పురస్కరించుకొని కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం రోజున అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు దుబాసి శ్రీనివాస్ తోటి కార్మికులతో కలిసి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా మేడే దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు కార్మికులు ఐక్యతగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు హమాలో సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు