# బీఅర్టియు ఘనంగా మేడే వేడుకలు.
నర్సంపేట,నేటిధాత్రి :
కేంద్రంలో చేసిన కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని బీఅర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఅర్టియు)
ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన హమాలీ యూనియన్, ఆటో, రిక్షా కార్మిక సంఘం, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్, ఆల్ షాప్ గుమస్తాలు, ఐస్ క్రీమ్ వర్కర్ల యూనియన్ ల ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేసి ఘనంగా ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఅర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ ఎన్నో త్యాగాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్టాలను రూపకల్పన చేస్తుందని దుయ్యబట్టారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ, కనీస వేతన చట్టాన్ని సవరిస్తూ కార్మిక హక్కులకు రక్షణ కవచంగా ఉన్న కార్మిక చట్టాలను మార్చడం మూర్ఖత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కార్మిక వర్గం ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్, దాడువాయి యూనియన్ రాష్ట్ర నాయకులు పెరమాండ్ల రవి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాదాసి నర్సింగరావు, సమ్మయ్య రిక్షా యూనియన్ గౌరవాధ్యక్షుడు మేడిద శ్రీనివాస్, మేడే ఉత్సవాల అధ్యక్షుడు సాంబమూర్తి, నాయకులు గాండ్ల రాములు, అనిల్, అల్వాల రాజు, బొచ్చు భాస్కర్, గజ్జల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.