పాలమూరు ఆడపడుచును కించపరిచే హక్కు రేవంత్ రెడ్డికి లేదు.
ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు.
పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మేకప్ రాణి అని తనను సంబోధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డి కె అరుణ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా
భార్య పిల్లలు ఉన్నారని వారు కూడా మోకాలకు పౌడర్ వేసుకుంటారని అలాంటప్పుడు తాను పౌడర్ వేసుకుంటేనే ఈ విధంగా కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. మహిళలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ఎలాంటి గౌరవ మర్యాదలు లేవని, అందువల్లే వారు తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పాలమూరు మహిళలను కించపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో
తన గెలుపు తథ్యమని తేలిపోవడంతో వారిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని అన్నారు. అందువల్లే వారు తనకు లభిస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక తనపై లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను హత్యా రాజకీయాలను ప్రోత్సహించానని వారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.కాంగ్రెస్ పార్టీ వారు సహాయం చేయలేకున్నా ఆ పార్టీ వారికి సహాయం చేసిన ఘనత తనదని, జిల్లాలోని అనేక సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది తానని, తాగునీటి, సాగునీటి వాటా సాధన కోసం పోరాటం చేసిన ఘనత కూడా
తనదేనని,అలాంటి తనపై ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు.వారు చేసిన నిరాధారణ ఆరోపణలకు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. రిజర్వేషన్ల విషయంలో కూడా సోషల్ మీడియా లో వారు ఫేక్ ప్రచారం చేస్తూ బిజెపిని దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆమె విమర్శించారు. వీటన్నింటిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు.
పాలమూరు వినాశనానికి వారు కంకణం కట్టుకున్నారని అందువల్లే దుష్ప్రచారాలకు పూనుకుంటున్నారని అన్నారు.ఒక ముఖ్యమంత్రి సతీమణి కూడా ఆడదే కదా అని ఆడపిల్లలు తనకు లేరా అని వాళ్లు కూడా మేకప్ రాణి లు కాదా అని అన్నారు.