చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బుధవారం రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపియాలని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని చందుర్తి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మా దాడి కర్ణాకర్ రావు ఉపాధ్యక్షుడు మూడపెల్లి శ్రీనివాస్ వైస్ ఎంపీపీ మందాల అబ్రామ్ నాయకులు ఊదారి రవి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు