జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవం
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జంగేడు గ్రామంలో మే డే ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీమతి కంప అక్షయ కార్మిక చట్టాల యొక్క ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కొండముచ్చుల రఘు, జంగా కృష్ణమూర్తి, పొక్కూరి రమేష్, కొత్తపెల్లి కుమార్, జంగం కుమార్, గూడెపు కార్తీక్, నిమ్మల శంకర్, గూడెపు రాజయ్య, మోర్పురి ఓదెలు, గూడెపు శివరాజ్, తులాల శ్రీనివాస్, దుర్గం కృష్ణస్వామి, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.