క్రెడిట్ కార్డు కలెక్షన్ సిబ్బంది వేదింపులే కారణం?
వరంగల్లో విషాదం
నేటిధాత్రి, వరంగల్
క్రెడిట్ కార్డు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్న యువకుడు సంస్థ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి విష్ణువర్ధన్ (23) బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడైన విష్ణువర్ధన్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.